రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఓగులాపురం గ్రామానికి చెందిన కూస తిరుపతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు 6 నెలల క్రితం మరణించగా అట్టి విషయం స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకు వెళ్ళగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసకవెళ్లగానే వెంటనే స్పందించి టిఆర్ఎస్ పార్టీ నుండి సభ్యత్వం ఉండడంతో వారికి ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల ప్రమాద భీమా చెక్కు మంజూరు కావడంతో ఈ రోజు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ ప్రతిరోజు ఒకేలా ఉండదు కార్యకర్తలు పార్టీ కోసం ప్రజల కోసం అనునిత్యం సేవలందిస్తుంటారు ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉండాల్సిందే పార్టీని నమ్ముకొని కార్యకర్తలు ఉంటే ఆ కార్యకర్తనే నమ్ముకుని ఓ కుటుంబం ఆధారపడుతుంది మరి ఏదైనా ప్రమాదం జరిగి ఏ కారణం చేతైనా ఆ కార్యకర్త మరణిస్తే అతని కుటుంబానికి భరోసా అందిస్తుందన్నారు కార్యకర్త అకాల మరణం చెందితే ఆ కుటుంబం పరిస్థితి ఊహించడం కష్టం ఇట్లాంటి పరిస్థితులను మార్చేందుకు తెలంగాణ సర్కార్ సభ్యత్వ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువచ్చిందని అన్నారు