డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని అప్పిలేట్ అథారటీ నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాలకు మేరకు విచారణ చేపట్టిన అప్పిలేట్ అథారిటీ.. పుష్ప శ్రీవాణి గిరిజనురాలేని స్పష్టం చేసింది. ఆమె ఎస్టీ కొండదొర సామాజిక వర్గంగా తెలిపింది. కాగా అప్పిలేట్ అథారిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.