భాగ్యనగరంలోని గచ్చిబౌలిలో పోలీస్ పెట్రోలింగ్ కార్ ప్రమాదానికి గురైంది. ఐటీ కారిడార్‌కు చెందిన పెట్రోలింగ్ కార్ వేగంగా వచ్చి గచ్చిబౌలి స్టేడియం దగ్గర డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు. అలాగే క్రేన్ సహాయంతో వాహనాన్ని తరలించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference