contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్‌..

 

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) తాజాగా జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 127 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులు పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలలో ఉన్నాయి. వీటిలో సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి.

పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 15 సీనియర్‌ అసిస్టెంట్‌, 10 జూనియర్‌ అసిస్టెంట్‌-టైపిస్టు పోస్టులు ఉన్నాయి. అలాగే ‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో 102 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు.

పోస్టుల సంఖ్య: 127

వెటర్నరీ యూనివర్సిటీలో 15 సీనియర్‌ అసిస్టెంట్ పోస్టులు

10 జూనియర్‌ అసిస్టెంట్‌-టైపిస్టు పోస్టులు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో 102 జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులు‌

విద్యార్హతలు: డిగ్రీతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత/ బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణత/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుతో డిగ్రీతో పాటు టైప్‌ రైటింగ్‌ ఇంగ్లిష్‌ (లోయర్‌ గ్రేడ్‌)లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్‌ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

పరీక్ష విధానం: ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (డిప్లొమా స్టాండర్డ్‌) 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌ పేపర్‌ మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు రూ.200/- , ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.80/-

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఏప్రిల్ 12, 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: మే 20, 2021

వెబ్‌సైట్‌:https://www.tspsc.gov.in/

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :