కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు నిర్వాహకుడు సందవేణి ప్రశాంత్ మాట్లాడుతూ సన్న రకాల వడ్లు BPT-5204 RNR-15048 జై శ్రీరామ్, దొడ్డు రకాలు MTU-1010 మరియు పెసర్లు నాణ్యమైన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపాడు ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు మరియు వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి జువ్వాడి మోహన్ రావు, టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్,న్యాత సుధాకర్, బొడ్డు సునీల్, గంప వెంకన్న, ఏలేటి చంద్రారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు
