రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బీజేపీ నాయకుల ఇండ్లలో రైతు గోస దీక్ష చేస్తున్నా బెంద్రం తిరుపతిరెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడతూ తెలంగాణా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ పిలుపుమేరకు రైతుల సమస్యలపరిష్కారం కోసం నేడు రైతులకు మద్దతుగా ఉదయం 10 గంll నుండి 1 గంటవరకు (తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష -)పేరు మీద అందరం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా దీక్ష చేస్తున్నాం,రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అకాల వర్షాలతో రైతులు పండించిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకెళ్లి ఇరవై రోజులు గడుస్తున్నా మార్కెట్ వాళ్ళు కొనుగోలు చేయక వర్షానికి ధాన్యం తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టటానికి రైతు కష్టపడినా కనికరం లేని ఈ తెలంగాణా ప్రభుత్వనికి బుద్ది లేదన్నారు, రైతులు పండించిన ధాన్యంతూకం వేసినాక రైస్ మిల్లకి వెళ్ళాక కూడా మళ్ళీ తాలు తరుగు పేరుతో మళ్ళీ కటింగ్ అంటూ దోపిడీ చేస్తూన్నారన్నారు,రైతు బందు ను మే నెల, సెప్టెంబర్ నెలలలోనే రైతు ఖాతాలో వేయాలన్నారు, ఏకకాలంలో రైతు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు,తెలంగాణా లో రైతులను దోపిడీ చేస్తుంటే వుంటే చూస్తూఊరుకునేది లేదన్నారు..