కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధోనోరా గ్రామవాసి బాలాజీ ఓ రైతు. అయితే ఎవరూ చేపట్టని విధంగా ఆపిల్ పంట వేసి విజయం సాధించాడు. ఇవాళ తన తొలి పంటను సీఎం కేసీఆర్ కు సమర్పించి మురిసిపోయాడు. ప్రగతి భవన్ కు వెళ్లిన రైతు బాలాజీ ఓ చిన్న బుట్టలో కేసీఆర్ కు ఆపిల్ ఫలాలు అందించాడు. ప్రకృతి రీత్యా అననుకూల వాతావరణంలో ఆపిల్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించిన రైతు బాలాజీని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. సీసీఎంబీ, వ్యవసాయ శాఖ సలహాలతో ఆపిల్ ను వాణిజ్య పంటగా సాగు చేస్తున్న రైతు బాలాజీ తెలంగాణ రైతాంగానికి కొత్త ఆశలు కల్పిస్తున్నాడు.