contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

దళితుల పై అణచివేతకు వ్యతిరేకంగా గన్నేరువరం ఎమ్మార్వో కార్యాలయాల ముందు బీజేపీ నాయకులు నిరసన

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయ ముందు బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మార్వో బండి రాజేశ్వరికి వినతి పత్రం సమర్పించారు బిజెపి నాయకులు 
మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణచివేత, దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి గజ్వేల్ లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం తాజాగా మరో ఉదాహరణ తన 13 గుంటల భూమిని లాక్కుంటున్నందుకే చచ్చిపోతున్నానని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోంది అని దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు అన్నారు  దళితులకు ఉచితంగా 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న సీఎం, ఉన్న భూమిని కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దారుణం బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా నింపడానికి వెళ్తున్న బిజెపి నాయకులను మార్గమధ్యలోనే అడ్డగించి, అరెస్టు చేయడం టీఆర్ఎస్ నియంతృత్వ వైఖరికి అద్దం పడుతుంది రాష్ట్రంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల దారుణాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు బాధితులను ఓదార్చి అండగా ఉండే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బిజెపి నాయకులను అడ్డుకోవడం, అక్రమ అరెస్టు చేయడం,గృహ నిర్బంధాలు చేయడం వంటి వాటికి పాల్పడుతోంది కనీసం ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు కూడా హరించివేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతుంది.టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం. దళిత ముఖ్యమంత్రి సహా దళితులకు ఇచ్చిన ఏ హామీ ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. పైగా టీఆర్ఎస్ నాయకులు దాడులు, అణచివేతలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. దళితుల పక్షాన ఉన్న బిజెపి నాయకులు, శ్రేణులపైనా నిర్బంధాలకు దిగుతున్నారు. భారతీయ జనతా పార్టీ దళితులకు అండగా ఉంటుందని వారి పక్షాన పోరాడతామని ఎన్ని నిర్బంధాలకు గురి చేసిన దళిత వ్యతిరేక టీఆర్ఎస్ పై బిజెపి పోరాటం ఆగదని అన్నారు ఈ కార్యక్రమంలో జంగపల్లి ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, బీజేపీ నాయకులు  జాలి శ్రీనివాస్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :