జర్నలిస్టులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని మానకొండూర్ నియోజకవర్గ జర్నలిస్టులు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో అలుగునూర్ రాజీవ్ రహదారిపై జర్నలిస్ట్ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై మద్దతు తెలిపారు.అనంతరం మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ లో జర్నలిస్ట్ లపై దాడుకి పాల్పడిన టీఆర్ఎస్వీ నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలపై తక్షణమే కఠిన శిక్షలు విధించి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎలుకపెల్లి సంపత్, కార్యదర్శి అనిల్, లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, బీజేపీ నాయకులు, నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు లంక స్వామి, ఉపాధ్యక్షులు ముత్యాల రాజిరెడ్డి, కార్యదర్శి కొంపెళ్లి సతీష్, కోశాధికారి మెడి గణేష్, అనిల్ కుమార్, మహేష్, శ్రీనివాస్, తిరుపతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.