కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బుర్ర మల్లేష్ గౌడ్ తన వ్యవసాయ పొలం వద్ద ఆదివారం తెల్లవారుజామున బర్రెల, దూడ లపై గుర్తుతెలియని అడవి జంతువు దాడి చేసింది ఆదివారం అటవీశాఖ అధికారి తిమ్మాపూర్,చిగురుమామిడి, గన్నేరువరం మండలాల ఇంచార్జి సుజాత రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అడవి జంతువు యొక్క అడుగు జాడలను పరిశీలించారు పంచనామా చేశారు, అటవీశాఖ అధికారి సుజాత రెడ్డి మాట్లాడుతూ పశువుల చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు.