contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దేశ సేవే కాదు .. సామాజిక సేవలో కూడా ముందున్న భారత జవానులు

 

దేశ సేవే కాదు సామజిక సేవలో కూడా ముందున్నామని  ఆదిలాబాద్ సి ఏ పి యఫ్ జవానులు నిరూపించుకున్నారు .  మంచిరియల్ జిల్లా  బాబురావు పేట గ్రామానికి చెందిన మహిళా ఊపిరితిత్తుల వ్యాధితో ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది . చికిత్సకు డబ్బులేక ఇబ్బందిపడుతూ  ఉండగా .. స్థానిక పేపర్ లో దాతల సాయం కోసం ఎదురు చూపులు అనే కధనాన్ని చూసి స్పందించిన జవానులు సుమారు యాభైవేల రూపాయల వరకు చందాలు వేసుకొని సి ఏ పి యఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితురాలికి అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో నారాయణ , నాగరాజు , మారుతి , కిరణ్ కుమార్ , ప్రభాకర్ పాల్గొన్నారు . 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :