contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

నిన్నటితో ముగిసిన రామమందిర విరాళాల సేకరణ… రూ.2 వేల కోట్లు వసూలు

 

రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన విరాళాల సేకరణ ముగిసింది. 44 రోజుల పాటు సాగిన ఈ విరాళాల సేకరణ నిన్నటితో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. రామ మందిరం కోసం రూ.2 వేల కోట్ల మేర విరాళాలు వచ్చాయని ట్రస్టు వర్గాలు తెలిపాయి. కాగా, ఇంకా చాలా నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం పెరిగే అవకాశముందని పేర్కొన్నాయి.విరాళాల ద్వారా అందిన మొత్తం నగదుకు ఆడిట్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని ట్రస్టు కార్యాలయం ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. అందుకోసం ఓ యాప్ ను కూడా రూపొందించామని, ఈ ప్రక్రియలో పాల్గొనేవారు ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయి, ప్రతిరోజూ డేటాను యాప్ లో పొందుపరచాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ నెలరోజుల పాటు సాగనుందని చెప్పారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :