కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బుధవారం మాజీ జెడ్పిటిసి మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జువ్వాడి మన్మోహన్ రావు ఆధ్వర్యంలో 350 మందికి నిరుపేద కుటుంబాలకు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ జెడ్పిటిసి సర్పంచ్ జువ్వాడి మన్మోహన్ రావు తన సొంత ఖర్చులతో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు లాక్ డౌన్ నేపథ్యంలో తిండికి లేక అలమటిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఈ సమయంలో ఆదుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి సహకార సంఘం చైర్మన్ అల్వాల కోటి, టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, గంప వెంకన్న, తీగల మోహన్ రెడ్డి,న్యాత సుధాకర్,బొడ్డు సునీల్,బూర వెంకటేశ్వర్,వివిధ గ్రామాల సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు