కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు సానిటీజర్ ,మస్కలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జ్ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు అందజేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోటర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షునిగా బుర్ర రాజ్ కోటి ఎన్నిక అయినందుకు గడ్డం నాగరాజు శాలువా కప్పి సన్మానించారు అనంతరం మండల జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం సానిటీజర్,మస్కలు, అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు జాలి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర సత్యనారాయణ గౌడ్, మునిగంటి సత్తయ్య, బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు