నెల్లూరు జిల్లా : నివర్ తుఫాను వలన నిరాశ్రయులై నిరుత్సహంతో కొట్టుమిట్టాడుతున్న షెడ్యూల్ తెగకు సంబందించిన గిరిజన వాసులకు మేమున్నాము అంటూ ముందుకు వచ్చారు టీం హెల్ప్ ది నీడి. వెంకటాచలంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న ఒడిస్సా కార్మీకులకు అలాగే గిరిజన వాసులకు ఆహార పొట్లాలను పంచారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ ది నీడి టీం సభ్యులు డా. ఉదయ్ శంకర్ అల్లం, పార్ధసారధి, చైతన్య, హేమంత్ సింగ్, వెంకట్, పవన్, భరత్ మరియు క్రాంతి పాల్గొన్నారు.