contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నేడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. సమయం కావాలన్న ఎపి ప్రభుత్వం

 

ఎపి లో ఈ రోజు   పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిన్న తెలిపారు. తొలి విడతలో 11 జిల్లాలకు సంబంధించి ఒక్కో డివిజన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాలను మినహాయించారు. అంతకుముందు నిన్న రాష్ట్రంలో హైడ్రామా నడిచింది. ఓ వైపు వ్యాక్సినేషన్, మరోవైపు ఎన్నికలు సాధ్యం కావని, కాబట్టి నోటిఫికేషన్ వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకే రమేశ్ కుమార్ మొగ్గు చూపుతున్నారు. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అక్రమాలను, హింసను నివారించడంలో విఫలమయ్యారన్న కారణంతో 9 మంది అధికారులను నిమ్మగడ్డ విధుల నుంచి తప్పించారు. నోటిఫికేషన్ విడుదల కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లకు నిమ్మగడ్డ లేఖలు రాశారు. అయితే, నిమ్మగడ్డ లేఖను వారు పట్టించుకోలేదు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీ, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :