contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నేడే సూపర్ స్ప్రెడర్ లకు వ్యాక్సినేషన్ : జిల్లా కలెక్టర్ కె. శశాంక

 జిల్లాలో సమాచార  పౌర సంబంధాల శాఖ, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ ల అధికారులు గుర్తించిన  సూపర్ స్ప్రెడర్ లకు శుక్రవారం  వ్యాక్సినేషన్ మొదటి డోస్ కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ కె .శశాంక తెలిపారు గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి  వైద్యాధికారులు ,జిల్లా అధికారులతో    సూపర్ స్ప్రేడర్ లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , జిల్లా . సమాచార పౌర సంబంధాల శాఖ, వ్యవసాయ శాఖ,  పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు గుర్తించిన సూపర్ స్ప్రే డర్ ల కు శుక్ర, శని వారాలలో  ప్రత్యేక  వ్యాక్సినేషన్ కేంద్రా ల ద్వారా మొదటి డోసు వ్యాక్సిన్ టీకా  వేయడం జరుగుతుందని  కలెక్టర్ తెలిపారు.   కరీంనగర్ అర్బన్ ,  రూరల్ ,  కొత్తపల్లి మండలాలకు సంబంధించిన విలేకరులకు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు, వ్యవసాయ శాఖకు సంబంధించిన ఎరువుల డీలర్లు, పెస్టిసైడ్స్ డీలర్స్, విత్తనాల డీలర్లు, హమాలీలకు సవరన్ వీధి లోని ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాలలో  , పౌర సరఫరాలు శాఖకు సంబంధించిన చౌక ధరల దుకాణాల డీలర్లు గుమస్తాలు వర్కర్లు ఎల్పిజి గ్యాస్ వర్కర్లు పెట్రోల్ బంక్ ల వర్కర్ల కు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు . ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలలో టెంట్లు, కుర్చీలు, త్రాగునీటి వసతి, టాయిలెట్ మొదలగు వసతులను కల్పించాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల కు సంబంధిత శాఖల అధికారులు ఇన్చార్జిలుగా వ్యవహరించాలని ఆదేశించారు.  తిమ్మాపూర్, గన్నేరువరం మండలాలకు  సంబంధించిన సూపర్  లు స్ప్రేడర్ లకు ఎల్ఎండి లోని మహిళా ప్రాంగణంలో, రామడుగు కు సంబంధించి రామడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, గంగాధర కు సంబంధించి గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మానకొండూరు సంబంధించి మానకొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, చిగురు మామిడి  కి సంబంధించి చిగురుమామిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, సైదాపూర్ కు సంబంధించిన సైదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, చొప్పదండి కి సంబంధించి చొప్పదండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, హుజురాబాద్ కు సంబంధించి హుజురాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, శంకరపట్నం సంబంధించి శంకరపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, వీణవంక కు సంబంధించి వీణవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జమ్మికుంట , ఇల్లంతకుంట మండలాలకు  సంబంధించి జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూపర్  స్ప్రేడర్ లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను  ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండలాలలో  పాత్రికేయులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

వ్యాక్సినేషన్ కేంద్రాలలు  ఉదయము 9:30 నుండి సాయంత్రం 4:30 గంటలకు వరకు కొనసాగుతాయని తెలిపారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా రెండు షిఫ్ట్ లలో  వ్యాక్సినేషన్ చేయించుటకు సంబంధిత అధికారులు  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ టీకాల కు వెళ్ళు సూపర్ స్పైడర్ లు తమతో  అధికారులు  జారీ చేసిన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో సహా వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సంబంధిత మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలు తగిన ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమం సజావుగా సాగుట కు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సాజిదా, జిల్లా వ్యవసాయ అధికారి  శ్రీధర్, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్ రెడ్డి ,  సివిల్ సప్లైస్ డి .ఎం. శ్రీకాంత్ రెడ్డి,,   జిల్లా పౌర సంబంధాల అధికారి కలీం, జిల్లా పరిషత్ సీఈఓ రమేష్,, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, మున్సిపల్ కమిషనర్లు తాసిల్దార్ లు, ఎంపీడీవోలు ,  ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :