కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ : గ్రామాల్లో పటిష్టమైన బూత్ కమిటీల వల్ల బిజెపి అభివృద్ధిలోకి వస్తుందని బిజెపి సీనియర్ నాయకులు,బూత్ కమిటీల నిర్వహణ మండల ఇంచార్జి ముత్యాల జగన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లి లో మంగళవారం పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన జగన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పిలుపు మేరకు బూత్ స్థాయిలో ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.టీఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పేర్కొన్నారు. పార్టీ పిలుపుమేరకు బూత్ కమిటీ 6 కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాలని సూచించారు.గ్రామాల్లో కార్యకర్తలు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై ఉద్యమించాలని కోరారు.అనంతరం జిల్లా పదాధికారులకు మండల శాఖ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనీల్, గొట్టిముక్కుల తిరుపతి రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మిశెట్టి మల్లయ్య,బూట్ల శ్రీనివాస్,మావురపు సంపత్, మహిళా మోర్చా అధ్యక్షులు చింతం వరలక్ష్మి పార్టీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు,కార్యవర్గ సభ్యులు,బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.బిజెపి లో చేరిన టీఆర్ఎస్ కార్యకర్తలు తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ, గొల్లపల్లి, మహాత్మానగర్ గ్రామాలకు చెందిన కొండపర్తి సాగర్, బండి స్వామి,గుండోజు అరవింద్, ఎలుక మురళి, కాల్వ శ్రీనివాస్, మల్లెత్తుల శ్రీరామ్, కాల్వ అరవింద్ లు బిజెపి లో చేరారు.వీరికి మండల అధ్యక్షులు జగదీశ్వరాచారి బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు