కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 7వ విడతలో భాగంగా చిగురుమామిడి మండలం రామంచ,గునుకులపల్లి,లంబాడిపల్లి గ్రామాలని ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించారు.ఈ సందర్భంగా వారు గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా పెరిగిన దారికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి,పురాతన పాత గోడలను,శిథిలావస్థకు చెందిన గోడలను కూల్చివేతలను పరిశీలించారు.పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి దానిని పరిరక్షించడానికి గల సూచనలు అందించారు. అనంతరం రామంచ, గునుకులపల్లి,లంబాడిపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో,వైకుంఠ ధామంలో, ప్రకృతి వనాలలో మొక్కలను నాటారు.ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు మనకు జీవనాధారం అని,వాటి వలన మనకు ఆక్సిజన్ ఎంతోగానో లభిస్తుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటి మాధవి, గునుకుల అమూల్య, నాగేల్లి వకుళ,ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఈవో ఆర్.విజయలక్ష్మి, ఎపివో రాధ,ఈసీ రాజయ్య, ఉప సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శి సుమంత్, శ్రవణ్,లావణ్య తదితరులు పాల్గొన్నారు.