భారత్ లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. అటు పారా మిలిటరీ బలగాల్లోనూ ఈ రక్కసి ఛాయలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటివరకు పారా మిలిటరీ దళాల్లో కరోనా బారినపడిన వారి సంఖ్య 750కి పెరిగింది. ఆఖరికి ఎన్ఎస్ జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) దళంలోనూ ఆదివారం తొలి కేసు నమోదైంది.ఇక ఆయా దళాల వారీగా కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే… బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో కొత్తగా 18 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 276కి చేరింది. ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్)లో 56 కొత్త కేసులు వెల్లడి కాగా, మొత్తం కేసుల సంఖ్య 156కి పెరిగింది. సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్)లో 236, సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్ బీ)లో 18, సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం)లో 64 కేసులు ఉన్నాయి.