జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఐ సాయిరమణ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. సూసైడ్ నోట్ రాసి తన కారులోనే పురుగుల మందు తాగాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న సాయిరమణ కుటుంబంతో కలిసి వరంగల్ లో ఉంటున్నాడు. నిన్న సాయంత్రం ఒంటరిగా కారులో బయల్దేరిన సీఐ కారులోనే పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ సిబ్బంది గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. కుటుంబ కలహాలు,ఆర్థిక సమస్యల కారణమని సూసైడ్ నోట్ లో ఉన్నట్లు కేయూసీ పోలీస్ స్టేషన్ సీఐ జానార్థన్ రెడ్డి గుర్తించారు.