కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామంలో రైతు ఏలేటి చంద్రారెడ్డి తన వ్యవసాయ పొలం వద్ద పొడి దుక్కిలో వరి విత్తనాలు నేరుగా వేసుకునే సాగు నూతన విధానం పై గన్నేరువరం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి సూచనలు చేశారు వారు మాట్లాడుతూ సాగుతో ప్రధానంగా రైతులు వ్యవసాయ కూలీల సమస్యని అధిగమించొచ్చు. ఈ పొడి దుక్కి విధానంలో ఎకరాకు 12 కిలోల విత్తనం సరిపోతుంది. కానీ సాధారణ వరి నాటు పద్ధతి లో ఎకరానికి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఒక ఎకరానికి వరి నాట్లు వేయడానికి 15 మంది వ్యవసాయ కూలీలు అవసరం ఉంటుంది,ఒకరికి 300 చొప్పున కూలి వేసిన 4500 రూపాయలు ఖర్చు అవుతుంది, పైగా 15 మందితో రోజుకు ఒక ఎకరా మాత్రమే నాట్లు వేయగలుగుతారు. కానీ ఈ నూతన విధానంలో ట్రాక్టరు మరియు సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ ఒక కూలి సహాయంతో విత్తుకోవచ్చు. ఈ సాగుకు అయ్యే దుక్కీ ఖర్చు ఎకరాకి 6000/- అదే సాధారణ పద్ధతిలో అయితే కూలీలకి 5000/-, పొడి దుక్కి 4000/-,బురద పొలం దున్నడానికి 6000/- విత్తనం ఖర్చు 1500/- మొత్తంగా 15 వేల నుండి 17 వేల ఖర్చు సాధారణ వరినాట్ల సాగుకు అవుతుంది. రెండు విధానాలను పోలిస్తే ఎకరాకి 10,000/- ఖర్చును కొత్త విధానంతో తగ్గించవచ్చు. పైగా ఈ విధానంతో పంటకోత కూడా పది రోజుల ముందే వస్తుంది. కనుక ఈ విధానంలో రైతులకు విత్తనం,కూలీల ఖర్చు మరియు సమయం ఆదా అవుతుందని తెలియజేశారు