కొండగావ్ జిల్లా కేశ్ కాల్ లోని కుఏమారి అటవీ ప్రాంతంలో పోలీసుల విస్తృత కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో , ఒక్కసారి గా ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా,ఘటనా స్థలం నుంచి బారి ఎత్తున రైఫిల్ తో సహా మారణాయుధాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతి చెందిన నక్సల్స్ గతంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రహదారి నిర్మాణ పనులు చేస్తున్న 17వాహనాలను నిప్పంటించి దగ్దం చేసిన ఘటనలో పాల్గొన్నట్లు గుర్తింపు.
ఘటనను దృవీకరించిన కొండగావ్ జిల్లా యస్పి సిద్దార్థ్ తివారీ,కేశ్ కాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన.