తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి దగ్గర లారీ బీభత్సం సృష్టించింది.
హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
మృతులు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్.ఎస్.రెడ్డిగా గుర్తించారు.
కోవిడ్ వ్యాక్సిన్ వెహికిల్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లేందుకు వీరు వచ్చినట్లు తెలుస్తోంది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.