భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:గత రెండు మూడు రోజులుగా గుండాల మండలం దేవలగూడెం మరియు దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళం మరియు యాక్షన్ టీంలు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఈ రెండు గ్రామాల సరిహద్దుల్లో ప్రతిరోజు గుండాల పోలీసులు మరియు స్పెషల్ పార్టీల ఆధ్వర్యంలో ఏరియా డామినేషన్ మరియు వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది.అదేవిధంగా నిన్న రాత్రి మాకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 4.15 గంటల సమయంలో గుండాల సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుంటే బైకుపై ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి,లొంగిపొమ్మని గట్టిగా కేకలు వేస్తుంటే అకస్మాత్తుగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు.అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిపై తిరిగి కాల్పులు జరిపారు.కొద్దిసమయం తర్వాత కాల్పులు జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సుమారుగా 25 సంవత్సరాలు కలిగిన ఒక గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహం,ఒక ఆయుధం మరియు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.