contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్ కమిషనర్ గా నాగార్జున?

ఓవైపు టాలీవుడ్ లో మెయిన్ స్ట్రీమ్ హీరోగా కొనసాగుతూనే, మరోవైపు ఇతర భాషల్లో ప్రత్యేక పాత్రల్లో, కీలక పాత్రల్లో కనిపించడం నాగార్జునకు ఇష్టం.

ఇప్పటికే ఇలా చాలా సినిమాలు చేసిన నాగ్, తాజాగా హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో కూడా నటించాడు. రణబీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ ది చాలా భిన్నమైన, ప్రత్యేకమైన పాత్ర. ఇప్పుడిలాంటిదే మరో ప్రత్యేక పాత్రను తమిళ్ లో చేయబోతున్నాడు నాగ్.

కోలీవుడ్ డైరక్టర్ వినోద్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు అజిత్. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి 2 సినిమాలు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారు. పాత్ర నచ్చడంతో నాగ్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది.

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో మరోసారి నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు అజిత్. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రాబోతున్న ఈ ప్రాజెక్టులో, అత్యంత కీలకమైన పోలీస్ కమిషనర్ పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ కోసం మోహన్ లాల్, మమ్ముట్టి, జగపతిబాబు లాంటి నటుల పేర్లు పరిశీలించారు.

అయితే నిర్మాత బోనీ కపూర్ మొత్తం సీన్ మార్చేశాడు. మోహన్ లాల్, జగపతిబాబు లాంటి నటులు ఆ పాత్ర చేస్తే రొటీన్ గా ఉంటుందని, నాగార్జునను తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. కేవలం సలహా ఇవ్వడమే కాదు, నాగార్జునతో మీటింగ్ కూడా ఏర్పాటుచేశాడు బోనీ కపూర్. అలా అజిత్ సినిమాలో ఎంటరయ్యాడు నాగ్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :