నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని పదర మండలంలోని గ్రీసు గండి నివసిస్తున్న నిరుపేదల కోసం 33 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతం కి రోడ్డు సక్రమంగా లేకపోవడంతో నిరుపేదలకు సహాయం చేయాలనుకుని. లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అడవి బిడ్డల కోసం వారికి సాయం చేయడం కోసం అడవికి వెళ్ళిన అచంపేట్ మాజీ ఎమ్మెల్యే డి సి సి అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ.కృష్ణ నది పరివాహక ప్రాంతం దట్టమైన అడవిలో ఉన్న చెంచులకు 33 కుటుంబాలకు వారం రోజులకు సరిపడుబియ్యం, కూరగాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నాగర్ కర్నూల్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండటానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సుదూర ప్రాంతంలో ఉన్న చెంచులకు అండగా ఉండటానికి అక్కడికి వెళ్లడం జరిగిందని.ఈ సందర్భంగా డా.వంశీకృష్ణ అక్కడ ఉన్న చెంచులతో కలసి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎప్పుడు ఏవిధమైన అవసరం ఉన్న మీకు అన్ని విధాల సహాయం చేయడానికి నేనున్నాననిధైర్యం చెప్పారు.ఎవరు కూడా ఆకలికి గురి కావద్దనికోరారు.అనంతరం వారికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు అందరు కూడా వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా సబ్బు ,లేదా శాని టైజర్ తో కడుక్కోవాలి. ప్రతి ఒక్కరు మస్కులు ధరించాలి వ్యాధినిరోధక శక్తి ని పెంచు ఆకు కురాలు,కూరగాయలు పండ్లు తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో పదర సర్పంచ్ ప్రేమ్ కుమార్, మండల అధ్యక్షులు రామ లింగయ్య యాదవ్ , నారాయణ రెడ్డి ,సత్యం , నాయకులు, పాత్రికేయులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.