contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి : మంత్రి కొప్పుల

 ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.  

  • గురువారం స్థానిక మిని పద్మనాయక కళ్యాణ మండపం లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్హించిన  జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. కరోనా రెండవ దశ వ్యాప్తి నేపధ్యంలో గత సంవత్సరం లాగే రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 84,339 మంది రైతుల నుంచి రూ.1042 కోట్ల విలువ గల 5.52 లక్షల మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని మద్దతు ధర పై కొనుగోలు చేసామని  మంత్రి తెలిపారు.    
  • దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికి కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయని, వాటి  పై విచారించి  తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు  మంత్రి సూచించారు. అనంతరం జిల్లాలో త్రాగు నీటి సరఫరా అంశం పై మంత్రి చర్చించారు. మిషన్ భగీరథ  పెండింగ్ పనులు పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధులు సైతం  వెంటనే అందిస్తామని తెలిపారు.  
  • మిషన్ భగీరథ ఇంట్రా పనులో భాగంగా 371 ఓవర్  హెడ్ ట్యాంకులు, 1894.41  కిమి  పైప్ లైన్, 201712 ఇంటికి నల్లా కనెక్షన్ పనులు పూర్తి చేసామని, నియోజకవర్గాల అభివృద్ది పథకం కింద త్రాగునీరందించేందుకు రూ.63 కోట్లతో 646  పనులు చేపట్టగా రూ.52 కోట్లతో 512 పూర్తి చేసామని,134  పనులు పెండింగ్ లో ఉన్నాయని  తెలిపారు. మిషన్ భగీరథ  అంశం  పై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి  కలెక్టర్ కు సూచించారు. 
  • మిషన్ భగీరథ  కింద ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు చేపట్టాల్సిన అదనపు పనుల  పై ప్రతి గ్రామం పరిశీలించి సంపూర్ణ నివేదిక సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ  పై సీఎం గారికి నివేదిక అందజేసి అవసరమైన మేర అదనపు నిధులు మంజూరు చేయించే విధంగా కృషి చేస్తామని మంత్రి  తెలిపారు.   
  • కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సారెస్పీ ప్రాజేక్టు పరిధిలో నీటి సమస్య ఉత్పన్నం కాదని తెలిపారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుత వానాకాలం పంటలో 1,96,899 లక్షల మంది రైతులకు 178.71  కోట్ల రైతు బంధు నిధులను జూన్ 22 వరకు  జమ చేసామని,1654 మంది మరణించిన రైతు కుటుంబాలకు 82.7 కోట్ల రైతు భీమా నిధులు  అందించడం జరిగిందని తెలిపారు.    
  • ఎస్సారెస్పీ పునర్జీవన పథకంలో భాగంగా  వరద కాలువ వినియోగిస్తు పనులు పూర్తి చేసామని,   వరద కాలువ నుంచి నిర్మీంచిన తుముల ద్వారా 2962 ఎకరాల ఆయకట్టుకు సైతం సాగునీరందించామని తెలిపారు. 
  • జిల్లాలోని గ్రామాలో పల్లె ప్రగతి  పనులు  త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని,  గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని  మంత్రి సూచించారు. పారిశుద్ద్య నిర్వహణ  పై అధిక శ్రద్ద వహించాలని సూచించారు. గ్రామాలో పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా మొక్కలను నాటామని, 3 శాతం మేర గ్రీన్ కవర్  వృద్ది చేసుకున్నామని మంత్రి  తెలిపారు. గ్రామాలలో కనీస అవసరాలు అందించే దిశగా స్మశానవాటిక, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, నర్సరీ వంటివి సమకూర్చుకున్నామని మంత్రి  తెలిపారు.  
  • పచ్చదనం, పారిశుద్ద్యం పై ప్రధాన ఎజేండాగా పల్లె ప్రగతి కార్యక్రమాలను సీఎం కేసిఆర్ చేపట్టారని  మంత్రి తెలిపారు. గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పెండింగ్ ఉన్న పనులు ప్రస్తుతం పూర్తి చేయాలని మంత్రి సూచించారు. గ్రామాలలో పూర్తి స్థాయిలో విద్యత్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి  ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, ఇంటి పై నుండి వెళ్లే  హై టెన్షన్ వైర్లు తొలగించే దిశగా  చర్యలు తుకోవాలని అన్నారు.   
  • సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు పకడ్భందిగా చేపట్టాలని, నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని,గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చివేయాలని, లోతట్టు ప్రాంతాలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని  మంత్రి అధికారులకు సూచించారు. 
  • ఎస్సీ కార్పొరేషన్ కింద అదనంగా యూనిట్ జిల్లా మంజూరు చేసామని, ఇందులో ముఖ్యంగా ల్యాండ్ డెవలెప్మెంట్ స్కీం, పశువుల పెంపకం వంటి వాటిని ప్రజాప్రతినిధులు అర్హులైన వారికి అవగాహన కల్పించి అమలు చేయాలని కోరారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్  రావు, గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ చంద్రశేఖర్ గౌడ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎం.పి.టి.సీలు, జడ్పీ సీఈఓ వినోద్ కుమార్,జిల్లా అధికారులు సంబంధిత జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :