- ఎస్ కే యు రెక్టార్ కు వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
అనంతపురము జిల్లా:ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం నాడు ఎస్కేయూ రెక్టార్ కృష్ణా నాయక్ గారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు కనీసమైన సౌకర్యాలు కల్పించకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయి అన్నారు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కాకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో జైలులో ఖైదీల కంటే దారుణమైన సౌకర్యాలు ఉన్నాయని వాపోయారు, సైన్స్ పరికరాల ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ లు, ఆట స్థలాలు, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా, లైబ్రరీ లేకుండా నడుపుతున్నారని అన్నారు, ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు చోద్యం చూస్తూ ఉండడం చాలా బాధాకరమన్నారు, ఒక చోట పర్మిషన్ తెచ్చుకొని మరొక చోట కళాశాల నిర్వహిస్తున్న కళాశాలలు జిల్లాలో ఎన్నో ఉన్నాయన్నారు, అంతే కాకుండా ఓకే బిల్డింగ్ లో స్కూలు కాలేజీలు నిర్వహిస్తున్న కళాశాలలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి అన్నారు,ఇప్పటికైనా జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి నడుపుతున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చేపడతామని అధికారులను హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వీరు యాదవ్, రమణయ్య, ఎస్కేయూ అధ్యక్షులు నరసింహ, నాయకులు శ్రీ రాములు, కృష్ణ,నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు