కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో స్వేరోస్ మండల అధ్యక్షులు లింగంపెల్లి రమేష్ అధ్వర్యంలో జంగపేల్లి ప్రభుత్వ హై స్కూల్ లో పదవ తరగతి పూర్తి అయిన రాపోలు చంద్రయ్య కుమార్తె రాపోలు అర్చన ట్రిపుల్ ఐటి భాసర లో సీట్ సంపాదించిన సందర్భంగా ఆ విద్యార్థిని ని స్వేరోస్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమన్మడ్ల యాదగిరి మరియు గ్రామ సర్పంచ్ అటికం శారద శ్రీనివాస్ హాజరయ్యారు. హన్మండ్ల యాదగిరి మాట్లాడుతూ ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివి మీ తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అని తెలిపారు, గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మా ఊరు విద్యార్థిని కి భాసర లో సీటు రావడం చాల ఆనందంగా ఉందన్నారు, అలాగే ఉన్నత చదువులు చదివి ఊరికి మన జంగపేల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూపెల్లి రమేష్, మరియు జంగపల్లి గ్రామ స్వేరోస్ సభ్యులు అలువాల ప్రదీప్, కొంకటి అనిల్, వేంకటేష్, నవీన్, జయ ప్రకాష్, పుర్ర రాజ్ కుమార్, మహంకాళి ప్రభాకర్, బెజ్జంకి రాజ్ కుమార్, అలువాల అరవింద్, కొంకటి వేణు, అలువాల హర్షవర్దన్, తదితరులు పాల్గొన్నారు.