ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ బాక్సాఫీసుకు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ధర్మప్రొడక్షన్‌లో స్వయంగా ఎన్నో సినిమాలు నిర్మించాడు. ఆయన ఇండియన్ సినీ పరిశ్రమకు చేసిన కృషిగాను లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎల్‌ఐఎఫ్‌ఎఫ్) ఐకాన్ అవార్డుతో సత్కరించింది. లండన్ వేదికగా గతవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం చివరిలో కరణ్ జోహార్‌తో పాటు బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆసిఫ్ కపాడియా ఈ ఐకాన్ ఆవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించారు. అలాగే హీరోయిన్ శృతి హాసన్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌లకు ఎల్‌ఐఎఫ్‌ఎఫ అవుట్ స్టాడింగ్ ఎచీవ్‌మెంట్ అవార్డు దక్కడం విశేషం.
