ఇటీవల కొత్తగా మోదీ కేబినెట్‌లో చేరిన ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విటర్ షాక్ ఇచ్చింది. ఆయన ట్విటర్ ఖాతా నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జిని హఠాత్తుగా తొలగించింది. అయితే తన ఖాతా నుంచి ట్విటర్ ఎందుకు బ్లూ టిక్ తొలగించిందనే దానిపై కర్నాటకకు చెందిన ఈ బీజేపీ నేత ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ఇంతకు ముందు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఖాతా నుంచి కూడా వెరిఫైడ్ బ్యాడ్జిని తొలగించిన విషయం తెలిసిందే. ఇనాక్టివ్‌గా ఉన్న కారణంగానే బ్లూ టిక్ మార్కును తొలగించినట్టు చెప్పిన ట్విటర్.. కొద్ది సేపటికి మళ్లీ పునరుద్ధరించింది.