contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

బడుగుల మీద గుదిబండగా కరెంట్ బిల్లులు : దాసరి ప్రవీణ్ కుమార్

 

  • ప్రభుత్వ లోటు బడ్జెట్ ను పూడ్చుకునేందుకే సామాన్య ప్రజల జేబులకు చిల్లులు
  • బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత

తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుల పై డెవలప్ మెంట్, సెక్యూరిటీ డిపాజిట్(ఎస్.డి)చార్జెస్ ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అధికమొత్తంలో విద్యుత్ బిల్లులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల పై గుదిబండగా మారుతూ వారి నడ్డివిరుస్తున్నారని బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత శుక్రవారం రోజు ఒక ప్రకట‌నలో తీవ్రంగా విమర్శించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత విద్యుత్ అలాగే 24గంట‌ల విద్యుత్ సరఫరా ఇస్తున్నామని చెప్పి విద్యుత్ వినియోగదారుల చెవిలో పువ్వులు పెడుతూ సామాన్యుల పై అదనపు విద్యుత్ బిల్లులను ఎలాంటి భేషజాలు లేకుండా కరాఖండిగా వసూలు చేసే విధానం సరికాదని దాసరి ప్రవీణ్ కుమార్ నేత తప్పుపట‌్ట‌ారు. 

నెలకు 500వందల రూపాయల లోపు వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు డెవలప్మెంట‌్ చార్జెస్, ఎస్.డి చార్జెస్ ల పేరిట‌ నాలుగు ఐదు వేల వరకు వస్తూంట‌ే ప్రజలు ఈ అధిక బిల్లులు ఏంట‌ని విద్యుత్ అధికారులని ప్రశ్నిస్తే మాకు ఏమీ తెలియదు ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తామని సంబదిత టిఎస్ ఎన్పీడిసియల్ అధికారులు సమాధానం చెప్పడంతో ప్రజలు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారని, అలాగే కరోనా ప్రభావంతో ప్రజలు ఉపాది కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుంట‌ే దానికి తోడుగా ఈ అధిక విద్యుత్ బిల్లులు ఏమిట‌ని మానసిక వేదనకు గురిఅవుతూ నానాఇబ్బందులు పడుతున్నా కనీసం పట‌్ట‌ించుకునే నాథుడే లేడని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారని దాసరి ప్రవీణ్ కుమార్ నేత తెలిపారు.

ఇప్పటికైనా ప్రజల ఆవేదనను అర్ధం చేసుకుని అధికంగా వసూలు చేస్తున్న విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకుంట‌ే ప్రజల ఆగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు గురికాక తప్పదని దాసరి ప్రవీణ్ కుమార్ నేత హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :