కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం: కోవిడ్19 వ్యాప్తి అరికట్టుటలో భాగముగా మార్చ్14 2020 రోజు నుండి గత మూడు నెలలకు పైగా పాఠశాలలు నిరవధికంగా మూసివేయడం జరిగింది చాలా వరకు పాఠశాలలో ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాలలోని బడ్జెట్ ప్రయివేటు పాఠశాలలు ఫీజులు వస్తేనే ఉపాధ్యాయుల జీతాలు, బస్సు మరియు ఫైనాన్స్ బకాయిలు చెల్లించే పరిస్థితిలో ఉన్నాయి గత వంద రోజులుగా ఆదాయం లేకపోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు యాజమాన్యాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్నట్లు ఇంకా రెండు నెలల వరకు పాటశాలల ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఇటువంటి విపత్కర పరిస్థితిలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి మరియు ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపున అందించాలని ఈరోజు ట్రస్మా చిగురుమామిడి తరపున మండల విద్యాధికారి విజయలక్ష్మి మరియు ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్ లకు వినతి పత్రం అందజేసినట్లు ట్రస్మా మండల అధ్యక్ష్యులు సమ్మిరెడ్డి తెలిపారు ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రణధీర్, కోశాధికారి సమ్మయ్య పాల్గొన్నారు