contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

బిజెపి పార్టీ ఆధ్వరంలో పంచాయతీ సిబ్బందికి , ఆశా వర్కర్ లకు కూరగాయలు పంపిణి

 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్  పిలుపుమేరకు ఆదివారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో సేవా హీ సంఘటన కార్యక్రమాన్ని సొల్లు హరీష్, కొంకటి అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు  సొల్లు అజయ్ వర్మ   హాజరై గ్రామపంచాయతీ సిబ్బందికి మరియు ఆశా వర్కర్ పద్మ      కి కీ పి. కిడ్స్ అందించడం జరిగింది  వివిధ రకాల కూరగాయలు అందించడం జరిగింది. అనంతరం రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి నేటితో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అగ్రరాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతమైనాడు, నేడు కరోణ మహమ్మారి తో యావత్ ప్రపంచ మంతా అతలాకుతలమైన సందర్భం అయినప్పటికిని ప్రధాని నరేంద్ర మోడీ అవర్ నిమిషాలు శ్రమిస్తూ దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు అని ప్రజల కు గుర్తు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారని గడపగడపకు బిజెపి పార్టీ ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా వచ్చిన ప్రతి కార్యకర్తకు అందరికీ అందుబాటులో ఉండి  వైద్యసేవలు అందించడాని హాస్పిటల్ లో చేర్పించి వారికి మనోధైర్యం నింపుతూ అండగా ఉంటున్నారు …గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ కష్టపడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆశా వర్కర్ పద్మ గారు కరోనా వచ్చిన ప్రతి కుటుంబాన్ని అందుబాటులో ఉంటూ వారికి కావలసిన మందులు కరోనా టెస్టులు చేయిస్తూవారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు

ఈ  కార్యక్రమంలో సొల్లు హరీష్ ,కొంకటి అనిల్, మద్దూరి  మహేష్ ,ఊట్ల చంద్రశేఖర్ కొంకటి కిషన్, సొల్లు ప్రవీణ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :