కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలోని బూత్ కమిటీ ల ఎంపికను త్వరితగతిన పూర్తి చేయాలని బిజెపి సీనియర్ నాయకులు బూత్ కమిటీల నిర్వహణ మండల ఇంచార్జి ముత్యాల జగన్ రెడ్డి పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఆదివారం బూత్ కమిటీల మండల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో పూర్తి స్థాయి కమిటీ ఉండాలని అన్నారు. బూత్ కమిటీ సహాయంతో రాబోయే ఎన్నికల్లో సునాయాసంగా గెలవవచ్చని తెలిపారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు వెనుక కమిటీల కృషి ఉందన్న విషయాన్ని గమనించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,ఉపాధ్యక్షులు మార్క హరి క్రిష్ణ గౌడ్, కార్యదర్సులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, పడాల శ్రీనివాస్, ఈసీ మెంబర్ బూట్ల శ్రీనివాస్, బిజెవైఎం, కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం అరుణ్,కంది రాజేందర్ రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బోనాల మోహన్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్,బిజెవైఎం ఈసీ మెంబర్ బండి సాగర్, తాళ్లపెల్లి రాజు గౌడ్, బొడ్డు అశోక్,ఒడ్డేపల్లి కనకయ్య,బండి స్వామి తదితరులు పాల్గొన్నారు.