ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామానికిని చెందిన గల్ఫ్ కార్మికుడు వడ్లకొండ అంజయ్య తండ్రి వడ్లకొండ ఐలయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి బెజ్జంకి వారి బృందం సహాయ కార్యదర్శి బోనగిరి రాజేందర్ మరియు రాంపురి రాజశేకేర్ ,తడకపెల్లి రమేష్ ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి సహాయంగా 50కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గైని సురేష్ , ఉపాధ్యక్షులు మరుపాక ఎల్లయ్య , కార్యదర్శి గుంటి శ్రీనివాస్, సభ్యులు ఉత్కం.తిరుపతి గౌడ్,దొంతి రాము, వేముల శంకర్ పాల్గొన్నారు.