దేశంలోని అగ్రశ్రేణి ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 511 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 29 లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 511
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్స్- 407
ఈ-రిలేషన్‌షిప్ మేనేజర్లు- 50
టెర్రిటరీ అధిపతులు- 44
గ్రూప్ హెడ్స్- 6
ప్రాడక్ట్ హెడ్స్ (ఇన్వెస్ట్‌మెంట్, రిసెర్చ్)- 1
ఆరేషన్స్ అండ్ టెక్నాలజీ హెడ్- 1
డిజిటల్ సేల్స్ మేనేజర్- 1
ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్- 1
ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
వయసు: అభ్యర్థులు 23 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. దరఖాస్తుల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 9, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2021
వెబ్‌సైట్:https://www.bankofbaroda.in/