ప్రపంచంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలలో మలేసియా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే పర్యాటకులను ఆకర్షించే మలేసియా కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు తమ దేశానికి రావద్దంటూ 22 దేశాలను నిషేధించింది. ఈ జాబితాలో ఉన్న దేశాల పౌరులు తమ దేశానికి రావద్దని విన్నవించింది. ఈ దేశాల్లో భారత్ కూడా ఉండటం గమనార్హం. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.మరోవైపు ఉపాధిని వెతుక్కుంటూ మన దేశం నుంచి అక్కడకు వెళ్లిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరిలో తెలంగాణకు చెందిన వారు అధికంగా ఉన్నట్టు సమాచారం. తాజాగా మలేసియా తీసుకున్న నిర్ణయంతో అక్కడున్న మన వారు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. మలేసియాలో ఇప్పటి వరకు 9,868 కరోనా కేసులు నమోదు కాగా… వీరిలో 9,189 మంది కోలుకున్నారు. 128 మంది ప్రాణాలు కోల్పోయారు.