కరీంనగర్ కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామ శివారులో గత నాలుగు రోజుల క్రితం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన గోలి శ్రీకాంత్ అనే వ్యక్తి పై భూ వివాదంలో తలెత్తిన గొడవల కారణంగా చంపడానికి ప్రయత్నించిన కేసులో శుక్రవారం రేకుర్తి గ్రామానికి చెందిన బండారి మారుతిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై ఎల్లయ్య గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా రూరల్ సిఐ మాట్లాడుతూ బండారి మారుతి ద్వారా భూ విషయాల్లో గాని ఇతర విషయాల్లో గాని మోసపోయిన వారు ఎవరైనా ఉన్నట్లైతే కొత్తపల్లి పోలీసు, కరీంనగర్ రూరల్ పోలీసు వారిని లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.