మంచు తుఫాన్ దాటికి ఉత్తర అమెరికా గడ్డకట్టుకుపోతుంది. చలి గాలుల తీవ్రత, భారీగా కురుస్తున్న మంచుతో వందళ ఏళ్ల రికార్డులు బ్రేకవుతున్నాయి. జనజీవనం ఎక్కడిక్కడ స్థంభించిపోయింది. అమెరికాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న పది రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కిటీకీలు, తలుపులు తెరవడానికి వీలులేనంతగా మంచు పేరుకుపోయి గడ్డకట్టిపోతుంది. చలి గాలులు బలంగా వీస్తుండటంతో సముద్రం పోటెత్తుతోంది. చాలా వరకు తీర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీనికి తోడు ఉత్తర అమెరికాలో చాలా చోట్ల కరెంటు కోత కూడా మొదలైంది. దీంతో సహాయం చేయాలంటూ ఎమర్జెన్సీ సర్వీస్‌లకు కాల్స్ పోటెత్తుతున్నాయి. మసాచుసెట్స్ ఏరియాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సుమారు పది లక్షల మంది ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.