వరంగల్ లో జరిగిన ఓ సభ లో మహిళ అధికారి ని అసభ్య పదజాలం తో దాషించడం పట్ల కరీంనగర్ బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో జిల్లా అధ్యక్షులు నిషాని రామచంద్రం జిల్లా కో ఆర్డినేటర్ దొడ్డే సమ్మయ్య తో కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంత్రుల నాలుకలా లేక అవి తాటి మట్టలా అని దుయ్యబట్టారు. మహిళ అధికారులకు భహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కరీంనగర్ మంత్రి గారు గంగుల కమలాకర్ గారు కూడ టీవీవి విధ్యార్తి నాయకుడి పట్ల దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు. తెలంగాణ మంత్రి వర్గం బూతు పురాణాలు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు . ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డే శ్రీనివాస్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపెల్లి భూమయ్య, జిల్లా కార్యదర్శి ముహమ్మద్ అబ్దుల్ జమీల్ , కోశాధికారి గాలి అనీల్ , నియోజకవర్గాల అధ్యక్షులు సంగుపట్ల మళ్లేషం , మారపెల్లి మొగిలయ్య, మాంకాళి తిరుపతి, పోతర్ల రాజు బివిఎఫ్ ప్రణయ్ కుమార్ లు పాల్గొన్నారు