భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం డివిజన్, చర్ల మండలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం డివిజన్, చర్ల మండలంలోని తిప్పాపురం పంచాయతీ పరిధిలోని తిప్పాపురం నుంచి బత్తినపల్లి వరకు ఐదు కోట్లతో భద్రాచలానికి చెందిన కాంట్రాక్టర్ రామచంద్రరావు నిర్మిస్తున్న రహదారి పనులకు ఉపయోగించే రోడ్డు రోల్లరు మరియు బ్లెడ్ ట్రాక్టర్ ను నిన్న రాత్రి మావోయిస్టులు తగలబెట్టిన్నారు. తగలబెట్టిన వాటి విలువ 50లక్షలు వరకు ఉంటుంది అని అంచనా. దాదాపు 90% పని పూర్తి అయినట్లు ఇంకా నాలుగు రోజులు అయితే పనులు పూర్తి కానునట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.