కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదిక సమీపంలో మరో లేగదూడ పై శనివారం రాత్రి అడవి జంతువు దాడి చేసినట్లు బాధితుడు రైతు కూన చంద్రశేఖర్ తెలిపాడు ఆదివారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, మరియు పశు వైద్య బృందం తదితర ప్రాంతాల్లో పరిశీలించారు , రెండు రోజుల క్రితం గన్నేరువరం గ్రామానికి చెందిన బుర్ర తిరుపతి గౌడ్ అనే వ్యక్తికి రైతు వేదిక దగ్గర్లో నడిరోడ్డుపై ఒక అడవి జంతువు కు సంబంధించిన జంతువు కనిపించాయని ఫారెస్ట్ అధికారులకు తెలిపాడు చిగురుమామిడి,తిమ్మాపూర్, గన్నేరువరం, ఫారెస్ట్ ఇంచార్జి సుజాత రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ పశువులను ఇంటి దగ్గర్లో పశువుల చుట్టూ కంచె ను ఏర్పాటు చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, రాత్రి సమయములో వ్యవసాయ బావుల దగ్గరికి ఒక్కరొక్కరు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు గన్నేరువరం మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు