కరీంనగర్ జిల్లా వార్షిక తనిఖీల్లో భాగంగా మానకొండూర్ పోలీస్ స్టేషన్ లోని రికార్డ్ లను తనిఖీ నిర్వహించిన సీపీ వి.బి కమలాసన్ రెడ్డి.ఈసందర్బంగా సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ..కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని మానకొండూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీలు నిర్వహించామన్నారు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను అనుకోని మానేరు వాగు ఉన్నదని ఆవాగు నుండి కలెక్టర్ ఆదేశాల అనుసారం మైనింగ్ ఆధ్వర్యంలో 4క్వారీలు నిర్వహిస్తున్నారని అన్నారు.అదేకాకుండా అక్రమంగా ఇసుక రవాణాతో పాటు అధిక ప్రమాదాలు జరుగుతాయని వాటిని అరికట్టడం కొరకు కమిషనరేట్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వేశామని అప్పటి నుండి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని అందులో మానకొండూర్ పరిధిలో సీఐ సంతోష్ కుమార్ ఇసుక మాఫియా పై,అలాగే రవాణా చేసే ట్రాక్టర్ల ఉక్కుపాదం మోపారని అన్నారు.అదేవిదంగా కరీంనగర్ జిల్లా పరిధిలో దాదాపు 1100ఇసుక ట్రాక్టర్ లపై కేసులు నమోదు కాగా అందులో మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 290ట్రాక్టర్ల పై సీఐ కేసులు నమోదు చేశారని అన్నారు.గతంలో కంటే ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన సీఐ తో పాటుగా పోలీస్ స్టేషన్ సిబ్బందిని సీపీ కమలాసన్ రెడ్డి ఈసందర్బంగా అభినదించారు.