contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“మార్పు కోసం-ప్రజా గళం” చర్చ వేదిక

 

తెలుగుదేశం పార్టీ  పార్లమెంట్ నియోజకవర్గం ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో “మార్పు కోసం-ప్రజా గళం” చర్చ వేదిక 

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల బిల్లులను వ్యతిరేకించిన అఖిల పక్షం

కరీంనగర్ జిల్లా పట్టణంలోని ప్రెస్ భవనం: పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు, రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ పై వక్తలు ప్రసంగించారు.ఈ సందర్భంగా అంబటీ జోజిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. ముందుగా సన్నకారు రైతులకు క్వింటాలుకు 2500 రూపాయలు మద్దతు ధర ప్రకటించి సంబరాలు చేసుకుంటే బాగుండేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టే పరిస్థితి వస్తుందని, ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే రెవెన్యూశాఖలో అవినీతి పేరిట వీఆర్వోలను తొలగించారన్నారు. వీఆర్వోను వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినంత మాత్రన అవినీతి తగ్గదని, అడిషనల్ కలెక్టర్ స్థాయి,మాజీ కలెక్టర్లు అవినీతికి పాల్పడుతుంటే ఆ స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం వలన భూసమస్యలు పరిష్కారం కావన్నారు. మొదలు రెవెన్యూశాఖలో పేరుకు పోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తే బాగుండేదన్నారు. కేసీఆర్ మొదలు అధికార పార్టీ నాయకుల అవినీతిని తగ్గించాలని, ఉన్నతాధికారుల బదిలీలకు అధికార పార్టీ నాయకులు డబ్బులు తీసుకుంటే ఇచ్చిన డబ్బుల సంపాదన కోసం అధికారులు అవినీతికి పాల్పడరా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఏ చట్టం తెచ్చినా అవి పెత్తందార్లకు ,బడా భూస్వాముల కోసమేనని, ఈ చట్టాలతో రైతులకు న్యాయం జరగదన్నారు. ధరణి సాఫ్ట్ వేర్ కేసీఆర్ కుటుంబానికి సంబంధించిందని, అది కేవలం వారి పర్యవేక్షణలోనే నడుస్తుందన్నారు. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి ప్రజల ఆస్తుల వివరాలు నమోదు చేస్తున్నప్పుడు ప్రజల అప్పులు కూడా నమోదు చేసి వాటిని ప్రభుత్వమే తీర్చేలా చట్టం తేవాలన్నారు. వెంటనే ధరణి సాఫ్ట్ వేరు ఉపసంహరించి పాత రెవెన్యూ చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎల్  ఆర్ ఎస్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలను ఇరకాటంలో పడేసిందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో లేఅవుట్ లేని ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయన్నారు. పేదలను దోచి ప్రభుత్వ ఖజానాను నింపేందుకే కేసీఆర్ ఈ విధానం ప్రవేశపెట్టారని జోజిరెడ్డి విమర్శించారు. పేదల పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో పేదల ప్లాట్లన్నీ రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణల బిల్లు రైతుల జీవితాలను నాశనం చేసేలా ఉందని, ఇది రైతుల పాలిట కేన్సర్ లా ఉందని, ఈ బిల్లులను అన్ని పార్టీలు వ్యతిరేకించాలన్నారు. రైతుల జీవితాలను ఆదానీ, అంబానీ చేతుల్లో పెట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగే విధంగా సవరణలు తీసుకు రావాలని, లేనిపక్షంలో రైతులకు నష్టం కలిగించే ఏ బిల్లునైనా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. లోక్ సత్తా జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నాయకుల  ప్రజలను గొర్రెల్లా చూస్తున్నారని, బాబ్రీ మసీదు విషయంలో ఎలాంటి ఆధారాలు లేవని బీజేపీ నాయకులకు క్లీన్ చీట్ ఇవ్వడం,నయీమ్ విషయంలో పోలీసు పాత్ర లేదంటూ అందరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పులు వెలువరించడం శోచనీయమన్నారు. మన కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊర్కోవడం వల్ల ఆ సాకుతో అధికారులు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎల్ ఆర్ ఎస్ పై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగిందన్నారు. ఎప్పుడో కొన్న భూములకు కొత్త చట్టం తెచ్చి ఇప్పుడు ఎల్ ఆర్ ఎస్చె ల్లించాలనడం భావ్యం కాదన్నారు. అందరూ కలిసి గళం ఎత్తి ఎల్ ఆర్ ఎస్   రద్దు చేసే విధంగా ప్రజా సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు చిన్న, సన్నకారు రైతుల నడ్డి విరిచిందని, ఈ బిల్లు కార్పొరేట్ సంస్థల కొమ్ముకాసే విధంగా ఉందని విమర్శించారు. పేద ప్రజలను దోచుకునేందుకు తీసుకు వచ్చిన ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్చే శారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యెడ సృజన్ కుమార్ మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టం లోపభూయిష్టంగా ఉందని, కేసీఆర్ ఏ చట్టం తెచ్చినా తెలంగాణ ప్రజలను వంచించే విధంగా ఉంటుందని, వెంటనే ఈ చట్టాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు ఆమోదయోగ్యంగా లేదని, వెంటనే రైతులకు అనుకూలంగా బిల్లులో సవరణలు చేయాలన్నారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్జి ల్లా ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రాజు మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును సవరించాలని, ప్రమాదకరమైన ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని,రెవెన్యూ చట్టం వల్ల ప్రజలకు, రైతులకు ఒరిగేమీ లేదన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, వైఎస్సార్ సీపీ నాయకులు సాన రాజన్న, టీజేఎస్ నాయకుడు బండమీది అంజయ్య, టీడీపీ నాయకులు కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం,బోలుమల్ల సదానందం, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కనకం వంశీ, రైతు సంఘం నాయకులు సమ్మిరెడ్డి, న్యాయవాదులు డి.మల్లయ్య, ఎర్రం రాజారెడ్డి తదితరులు చర్చావేదికలో ప్రసంగించారు. నగర పార్టీ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి, సందబోయిన రాజేశం, పర్లపల్లి రవీందర్,  రొడ్డ శ్రీధర్, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి,టేకుల శ్రావణ్,ఎర్రవెలి రవీందర్,దాసరి రామకృష రెడ్డి, కిషన్, బత్తుల శ్రీనివాస్, వినీత్,సతీష్,ఇల్లందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :