భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ రోజు ఉదయం 9గంటలకు మల్లెపల్లితోగు అటవీప్రాంతంలో మావోయిస్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం పోలీసులను చూసి వారికి సంబంధించిన సామాగ్రిని వదిలిపెట్టి పారిపోయిన మావోయిస్టుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు.