contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మావోయిస్టు కొరియర్(మాజీ దళ సభ్యుడు) అరెస్ట్

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:నిషేధిత మావోయిస్టు పార్టీ మాజీ దళ సభ్యుడు, ప్రస్తుత మావోయిస్టు కొరియర్ ను  పట్టుకున్నట్లు గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పత్రికా సమావేశంలో తెలిపిన భద్రాచలం ASP డాక్టర్ వినీత్ ఐపీఎస్. డాక్టర్ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ 20వ PLGA ఆవిర్భావ వారోత్సవాలలో భాగంగా మావోయిస్టు పార్టీ తెలంగాణ ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మీటింగ్ నిర్వహించి, భారీగా పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించనున్నారని  విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు, చర్ల పోలీసులు  డిసెంబర్ 9 బుధవారం  మధ్యాహ్నం చింతగుప్ప, బోధనెల్లి అడవి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా సుమారు 3 గంటలకు అటుగా  వస్తున్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని వెంబడించి, అందులో ఒకరిని పట్టుకుని విచారించగా అతను  చర్ల మండలం, కొండివాయి గ్రామానికి చెందిన పోడియం జయరామ్@గురూజీ@ఇడమయ్య(30), తండ్రి పేరు భీమయ్య అని చెప్పాడని ASP తెలిపారు. అతని వద్ద ఉన్న స్టీల్ టిఫిన్ బాక్స్ లో 10- జెలటిన్ స్టిక్స్, 2 -డిటోనేటర్ లు, 2-ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్, 2-ఎలక్ట్రిక్ బ్యాటరీలను పోలీసులు గమనించి పూర్తిస్థాయిలో విచారించగా అతను 2006వ సంవత్సరం నుండి నేటి వరకు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినట్లుగా నిర్ధారణ అయిందని ఆయన అన్నారు. 2006 లో అప్పటి మిలీషియా కమాండర్  రతన్ కి కొరియర్గా మొదలు పెట్టిన  జయరామ్, 2009-12 సుఖుధేవ్ దళంలో మావోయిస్టు పార్టీ సభ్యునిగా,  2012-15 చర్ల వెంకటాపురం మావోయిస్టు పార్టీ ఏరియా సభ్యునిగా పనిచేశాడు. 2016 నుండి నేటి వరకు తెలంగాణ మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషణ్@లక్మకి మరియు BK-EG సెక్రటరీ అయిన ఆజాద్ కి ప్రధాన కొరియర్ గా పని చేస్తున్నాడు. సుమారు 15 సంవత్సరాలుగా నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రంలో యాభైకి పైగా నేరాల్లో పాల్గొన్నాడు. వీటితో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో మరికొన్ని నేరాల్లో పాల్గొన్నాడు. వీటిలో అనేక కేసులు ఊపా చట్టం కింద నమోదై ఉన్నాయి. డిసెంబర్ 2 నుండి వారోత్సవాలు జరపాలని నిర్ణయించి, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసక చర్యలు జరిపి తమ ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ స్టేట్ కమిటీ అగ్రనాయకత్వం, ఏరియా కమిటీలు, మిలీషియా కమిటీలు కుట్రపన్ని,  కుట్రలో భాగంగా నిందితుడు జయరాం మరికొంత మంది మిలేషియా సభ్యులతో కలిసి, కూంబింగ్ లో ఉన్న పోలీస్ పార్టీ లను టార్గెట్ చేసి, ప్రేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేసి, పోలీసులను హతమార్చాలనే   లక్ష్యంతో ఒక టిఫిన్ బాక్స్ లో ప్రేలుడు పదార్థాలతో వస్తుండగా కూంబింగ్ లో వున్న చర్ల పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.మిగిలిన మిలీషియా సభ్యులు పారిపోయారు. నిందుతునిపై హత్యా ప్రయత్నం మరియు ప్రేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపినట్టు  ఎఎస్పీ అన్నారు. మావోయిస్టు పార్టీ మిలిషియా సభ్యులు, మావోయిస్టు పార్టీ కమిటీ సభ్యులు, దళ సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారిపైన ఉన్న కేసులు మాఫీ చేసి, జనజీవన స్రవంతిలో బ్రతకడానికి కావలసిన ఆర్థిక సహాయం జీవనోపాధిని కల్పిస్తామని, పోలీసులు వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని ASP వినీత్ IPS ఈ సందర్భంగా తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :