contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ముగ్గుల పోటీల్లో గెలిచిన మహిళలకు బహుమతులు ప్రధానం చేసిన ప్రజా ప్రతినిధులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపెట గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి, లయన్స్ క్లబ్ జిల్లా జోనల్ చైర్మన్ గంప వెంకన్న తల్లి గంప నర్సమ్మ స్మారకార్థం మకర సంక్రాంతి బుధవారం రోజున గ్రామ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఎంపీటీసీ ఏలేటి స్వప్న చంద్రారెడ్డి పాలక వర్గం సభ్యుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు ప్రథమ బహుమతి బుర్ర రమ్య, ద్వితీయ బహుమతి బద్దం రిషిత, తృతీయ బహుమతి కర్నె పద్మ లకు చీరలు పంపిణీ చేశారు పాల్గొన్న మహిళలకు కన్సల్టేషన్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ మా తల్లి స్మారకార్తం నిర్వహించిన ముగ్గుల పోటీల లో పాల్గొన్న మహిళలకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న, ఎంపిటిసి ఏలేటి స్వప్న చంద్రా రెడ్డి, ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, కో అప్షన్ సభ్యుడు ఆకేన వైకుంఠం,ఏలేటి సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు బుర్ర ఎల్లయ్య గౌడ్, బత్తుల లక్ష్మీ, కళ్లేపల్లి సంతోష్ కుమార్, ర్యాగటి వీరయ్య,సందేవెని మంజుల,బొజ్జ రేణుక, సందవేని సునిత,నాయకులు బద్దం మల్లా రెడ్డి, బద్దం రమణా రెడ్డి, సందవేని ఐలయ్య, మునిగంటి కొమురయ్య,మహిళా సంఘాల సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :