కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ జెండా ఎగర వేస్తుందని ఆ పార్టీ నాయకులు సొల్లు అజయ్ వర్మ అన్నారు ఎంపీ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో పార్టీ దూసుకు పోతుందన్నారు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను గడపగడపకు తీసుకెళ్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాచకొండ రాకేష్, వాసు రమేష్ తదితరులు పాల్గొన్నారు